'మా' మంచి ముఖ్య‌మంత్రి : కేసీఆర్‌కి 'మా'అభినంద‌న‌

By iQlikMovies - December 12, 2018 - 11:01 AM IST

మరిన్ని వార్తలు

రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న కేసీఆర్‌కు దేశం న‌లుమూల‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌కి అభినంద‌న‌లు తెల‌ప‌డంలో సినీ సెల‌బ్రెటీలు ముందున్నారు. ఇప్ప‌టికే చాలామంది క‌థానాయ‌కులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపారు. ఇప్పుడు 'మా' ప్ర‌త్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ అభినందించింది.

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ ``టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో పాటు ప‌డింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా మా ముందు ఓ పెద్ద బాధ్యత ఉంది.

గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలనుకుంటున్నాం'' అన్నారు. ''ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం ఈ రోజు చాలా క‌ష్టం. అలాంటిది  మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించ‌డం గొప్ప విశేషం'' అని  'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS