స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం 'నిశ్శబ్డం'. దాదాపు 5 భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సింది. కానీ లాక్ డౌన్ కారణం గా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం.. ఇక థియేటర్స్ లో విడుదలయ్యే ఛాన్స్ లేదని, డైరెక్ట్ గా ఏదో ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని 'నిశ్శబ్దం' టీం నుండి ఒక క్లారిటీ ఇచ్చారు.
లాక్ డౌన్ అనంతరం కోవిడ్ నిబంధనలతో థియేటర్లు తెరుచుకుంటాయని.. తెలంగాణా మరియు ఆంధ్ర ప్రభుత్వాలు చెప్పడం తో నిశ్శబ్దం లాంటి పలు చిత్రాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది జరగడం లేదని తెలియడం తో మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఓ పక్క షాపింగ్ మాల్స్ తెరిచినా జనాలు వాటిని సందర్శించడానికి భయపడుతూనే వున్నారు.. ఈ నేపధ్యం లో థియేటర్లు తెరిచినా ఇదే జరుగుతుందని ఊహిస్తున్నారు విశ్లేషకులు.
దీనికి తోడు ఈ మధ్య ఓటీటీలో విడుదలైన ఒకటి రెండు చిత్రాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు, వ్యూయర్ షిప్ పడిపోతుంది. ఇలాగే కొనసాగితే ఓటీటీ సంస్థలు కొత్త చిత్రాలను కొనడానికి ఆసక్తి చూపించకపోవొచ్చు.. అందుకని నిశ్శబ్దం లాంటి చిత్రాలు వీలైనంత త్వరగా ఏదో ఒక ఓటీటీ తో డీల్ కుదుర్చుకోబోతున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై 'నిశ్శబ్దం' టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.