నా బాడీ బిల్డింగ్ కి కారణం 'బన్నీ' బావే: నవదీప్.!

మరిన్ని వార్తలు

సినీ ఇండస్ట్రీ లో ఎటువంటి వారసత్వాలు లేకుండా నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటింది దాదాపు 15 ఏళ్లుగా, తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ నటుడు నవదీప్. తేజ దర్శకత్వం లో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన నవదీప్.. తరుచూ ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు తన పాత్రలను, లుక్స్ ను మార్చుకుంటూ వస్తున్నాడు.. అందుకే నవదీప్ ఇంకా ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా నవదీప్ వెబ్ సిరీస్ ట్రెండ్ ని కూడా ఈజీ గా అలవరుచుకున్నాడు. దానికి తగ్గట్టు కథలు, పాత్రలు ఎంచుకొని నెట్టుకొస్తున్నాడు. ఇందులో భాగంగానే నవదీప్ ఊహించని విధంగా బాడీ పెంచేసి మ్యాన్లీ లుక్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.

 

అయితే తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడుతూ.. తను ఈ రేంజ్ లో బాడీ పెంచడానికి ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే.. తాను ముద్దుగా బావ అని పిలిచే 'అల్లు అర్జున్' అని చెప్పుకొచ్చాడు నవదీప్. బన్నీ, నవదీప్ ఎప్పటినుంచో మంచి స్నేహితులు. చెప్పాలంటే తెలుగు సినిమాల్లో మొట్టమొదట సిక్స్ ప్యాక్ బాడీ ట్రెండ్ సెట్ చేసింది కూడా బన్నీనే. తన 'దేశముదురు' చిత్రం తో బన్నీ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఎన్ని సిక్స్ ప్యాక్ బాడీలు చూసామో.. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా.. తన సహచరులకి కూడా స్ఫూర్తి నింపడం గొప్ప విషయమే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#sixmonthsofnosugar

A post shared by Nav Deep (@pnavdeep) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS