పవన్ కళ్యాణ్ నష్ట పరిహారం చెల్లించాల్సిందే..!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం విడుదల అవ్వడం ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడడంతో నిర్మాత సంగతి అటుంచితే డిస్ట్రిబ్యూటర్లని మాత్రం పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా, పండగ మూడు రోజులు ఈ చిత్రానికి కలెక్షన్స్ వస్తాయి అని పవన్ అభిమానులు ఆశించినా వారికి నిరాశే మిగిలింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి అసలు కలెక్షన్స్ లేకపోవడంతో అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

దీనికి సంబంధించి ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాని పంపిణీ చేసిన వారంతా ఒక్కటై త్వరలోనే పవన్ కళ్యాణ్ తో పాటు అజ్ఞాతవాసి నిర్మాతని కలిసి తమకి న్యాయం చేయాలని కోరనున్నారట. ఇప్పటికే సినిమా ఫ్లాప్ అయితే హీరో బాధ్యత తీసుకోవాలా అక్కర్లేదా అనే అంశం పైన రెండు రకాల వాదనలు ఉన్నాయి.

మరి త్వరలోనే వీరు పవన్ కళ్యాణ్ ని అలాగే నిర్మాత చినబాబుని కలిస్తే ఎటువంటి సమాధానం చెబుతారో అన్నది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS