పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకి సంబంధించి ఒక కీలక విషయం బయటికి వచ్చింది.
అదేమనగా- అజ్ఞాతవాసి టీజర్ విడుదల అయిన రోజు నుండి ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా కి కాపీ అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే- సదరు ఫ్రెంచ్ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన T-సిరీస్ వద్ద ఉండడం ఇప్పుడు వాళ్ళు అజ్ఞాతవాసి నిర్మాతలని ఈ విషయమై వివరణ కోరడం జరిగింది.
ఇక T-సిరీస్ మరియు ఈ చిత్ర నిర్మాణ సంస్థ మధ్యలో ఈ విషయానికి సంబంధించిన చర్చల అనంతరం అజ్ఞాతవాసి నిర్మాతలు T- సిరీస్ వారికి రూ 20 కోట్లు ఇవ్వవలసిందిగా ఒప్పందం కుదిరిందట. దీనితో ఈ అంశానికి సంబంధించి వివాదం ముగిసినట్టే అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇదిలావుండగా అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల జాప్యం వెనుక ఇదే కారణం అయి ఉంటుంది అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ వివాదం ముగిసినట్టుగా ఉంది కాబట్టి, రేపు అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల కావొచ్చు.