పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రపంచ నలుమూలల నుండి అభిమాన ఘనం ఉంది. అందులోని ఒక చిన్న బుడతడు తన అభిమాన నటుడి కోసం కొడకా కోటేశ్వరరావు పాటని పాడి ఆ వీడియో పంపించాడు. అయితే ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు.
అయితే ఆ పాట పాడింది తెలుగు అబ్బాయి కాదు సరికదా భారతదేశానికి చెందిన వాడు కూడా కాదు. బిగ్స్ అనే ఆ చిన్న పిల్లవాడు పోలాండ్ దేశానికి చెందిన వాడు అవ్వడం అతనికి తెలుగు కూడా మాట్లాడడం రానివాడు. అంటే కేవలం తెలుగులో వచ్చిన పాటని విని అలానే పాడేసాడు అని అర్ధమవుతుంది.
అందుకే ఈ వీడియో కి అంత ప్రాముఖ్యత లభించింది. అయితే ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అయి చివరికి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్, పాట చాలా బాగుంది అని అలాగే కొత్త సంవత్సర కానుకగా తనకి ఈ వీడియో ని పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆ పిల్లవాడికి తన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు.
మొత్తానికి పోలాండ్ నుండి పవన్ కళ్యాణ్ కి వచ్చిన గిఫ్ట్ పవర్ స్టార్ కి తెగ నచ్చేసింది.