ఆహా` కాదు.. `అయ్యో` అనాలేమో..?

మరిన్ని వార్తలు

తెలుగులో తొలి ఓటీటీగా ఖ్యాతి తెచ్చుకొంది ఆహా. అల్లు అర‌వింద్ లాంటి క్రియేటీవ్ బ్రైన్స్ ఈ ప్రాజెక్టులో ఉండేస‌రికి.. అంద‌రికీ ఆహాపై అంచనాలు భారీగానే ఏర్ప‌డ్డాయి. అమేజాన్‌, జీ 5, నెట్‌ఫ్లిక్స్ తో తీవ్ర‌పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. వ‌ర్జిన‌ల్ కంటెంట్ ఇవ్వ‌డానికి ఆహా బాగానే క‌ష్ట‌ప‌డింది. అన్ స్టాప‌బుల్ తో.. ఆహాకి ఒక్క‌సారిగా క్రేజ్ పెరిగింది. స‌బ్‌స్క్రైబ‌ర్స్ కూడా భారీగా పెర‌గ‌డంతో.. ఆహా దూసుకుపోయింది. అయితే.. ఈ యేడాది ఆహాకు ఏకంగా రూ.92 కోట్ల న‌ష్టాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. గ‌తేడాది కూడా ఆహా న‌ష్టాల ఊబిలోనే ఉంది. గ‌తేడాదితో పోలిస్తే ఈ యేడాది న‌ష్టం మూడు రెట్లు ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

 

అన్ స్టాప‌బుల్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఆహాకి స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరిగారు. అలాంట‌ప్పుడు.. క‌చ్చితంగా ఆదాయం బాగుండాలి. కానీ అనూహ్యంగా సంస్థ న‌ష్టాల్నిచూపిస్తోంది. కంటెంట్ కోసం ఆహా చాలా ఖ‌ర్చు పెడుతోంది. దానికి తోడు.. ఆహా కోసం ప‌నిచేస్తున్న ఉద్యోగుల జీతాలు, వాళ్ల క‌నీస సౌక‌ర్యాల కోసం ఆహా చాలా ఖ‌ర్చు పెడుతోంద‌ట‌. దానికి తోడు.. కొన్ని వెబ్ సిరీస్ కోసం భారీ మొత్తం పెట్టుబ‌డులు పెట్టింది. అవి పూర్త‌యి.. ఆహాలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ ఖ‌ర్చు ఖ‌ర్చుగానే ఉంటుంది. దాని వ‌ల్ల అద‌న‌పు ఆదాయం ఏమీ ఉండ‌దు. అందుకే... రాబ‌డి త‌క్కువ‌గా ఖ‌ర్చు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. రెండేళ్ల పాటు న‌ష్టాల బాట‌లోనే న‌డ‌వ‌డం ఏ సంస్థ‌కైనా క‌ష్ట‌మే. అందుకే ఈ యేడాదైనా సంస్థ‌ని లాభాల బాట ప‌ట్టించాల‌ని ఆహా తీవ్రంగా కృషి చేస్తోంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS