శ్రుతిహాస‌న్‌లో మ‌రో కోణం... షాక‌వుతున్న ఫ్యాన్స్

మరిన్ని వార్తలు

శ్రుతిహాస‌న్ ఆల్ రౌండ‌ర్‌. త‌ను న‌టి మాత్ర‌మే కాదు, మంచి సింగ‌ర్. కంపోజ‌ర్ కూడా. త‌న‌కు సొంతంగా ఓ ట్రూప్ కూడా ఉంది. ఈమ‌ధ్య వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. అన్ని భాష‌ల చిత్రాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకొంటోంది. తాజాగా త‌న‌లోని మ‌రో టాలెంట్ ని బ‌య‌ట‌పెట్టాల‌ని నిర్ణ‌యించుకొంది. త‌ను... స్క్రీన్ రైటింగ్ లోనూ త‌న ప్రావీణ్యం చూపించాలనుకొంటోంద‌ట‌. ఈ విష‌యాన్ని త‌నే చెప్పింది. క‌థ‌లు రాయ‌డ‌మ‌న్నా, చెప్ప‌డం అన్నా త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, త్వ‌ర‌లోనే.. ర‌చ‌యిత‌గానూ... త‌న ప్ర‌తిభ చూపించాల‌నుకొంటోంద‌ని పేర్కొంది శ్రుతి హాస‌న్‌. దాంతో శ్రుతిలో ఈ కోణ‌మూ ఉందా? అంటూ ఆశ్చర్య‌పోతున్నారు ఫ్యాన్స్‌.

 

అయితే.. అది సినిమా క‌థా? లేదంటే ఏదైనా వెబ్ సిరీస్‌, షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తోందా? అనేది మాత్రం చెప్ప‌డం లేదు. మ‌న ఇండ‌స్ట్రీలో చాలామంది క‌థానాయిక‌ల‌కు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. రాశీ ఖ‌న్నా క‌విత్వం రాస్తుంటుంది. నిత్య‌మీన‌న్ కీ... ర‌చ‌నా వ్యాసంగంలో ప్రావీణ్యం ఉంది. అయితే వీళ్లెవ‌రూ ర‌చ‌యిత‌గా త‌మ ప్ర‌తిభ‌ను చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేయ‌లేదు. శ్రుతి ఆ ప‌ని చేస్తుందేమో చూడాలి. శ్రుతి క‌థ‌లు తెర‌పైకొస్తే... దానికంటూ సెప‌రేట్ క్రేజ్ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్య‌మూ లేదు. ఎంతైనా... విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురు క‌దా..? ఆ మాత్రం టాలెంట్ ఉండ‌డంలో త‌ప్పు లేదు లెండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS