ఐషా.. పిచ్చ హీటెక్కించేస్తావ్‌ హమేషా

By iQlikMovies - October 29, 2018 - 09:41 AM IST

మరిన్ని వార్తలు

'చిరుత' ఫేం నేహా శర్మ గుర్తుందా? మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా నటించిన తొలి సినిమా 'చిరుత'. అందులో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీనే నేహా శర్మ. ఆ తర్వాత తెలుగులో ఇంకో సినిమా చేసిన నేహా, ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయిపోయింది. అక్కడా అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశాలేం లేకపోయినా, ఎలాగోలా నెట్టుకొచ్చేస్తోంది. అక్క నేహా శర్మ పరిస్థితి ఇలా వుంటే, చెల్లెలు ఐషా శర్మ పరిస్థితి ఇంకా దారుణం. అయితేనేం, అవకాశాల్లేకపోయినా అక్కా చెల్లెళ్ళిద్దరూ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలతో చెలరేగిపోతూ, అభిమానుల్ని పెంచేసుకుంటున్నారు. ఈ విషయంలో ఒకర్ని తక్కువ అనీ, ఇంకొకర్ని ఎక్కువ అనీ అనడానికి వీల్లేదు. చూస్తున్నారు కదా, ఐషా శర్మని.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందంతే. ఇంతకు మించిన ఎక్స్‌పోజింగ్‌తో కూడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఎన్నో షేర్‌ చేసినా, ఐషా శర్మ తాజా ఫొటో టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌గా మారిందిప్పుడు. చక్కనమ్మ చూపిస్తానంటే, 'వద్దు, మేం చూడం..' అనేవారెవరైనా వుంటారా.? ఛాన్సే లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS