#RRRకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోయే పాత్ర కోసం ఆయన సన్నాహాలు మొదలుపెట్టేశాడు.
ఇంటర్నేషనల్ ట్రైనర్ స్టీవ్స్ లాయిడ్ ప్రత్యేక శిక్షణలో ఎన్టీఆర్ రాబోయే 6-7 నెలల్లో తర్ఫీదు పొందనున్నాడట. ఇందుకు గాను ఆయన కోసం స్పెషల్ డైట్ డిజైన్ చేశారట. ఇప్పటికే తారక్ పాత్ర, ఆయన కనిపించబోయే తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది అని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు ఇప్పటికే ఒక హింట్ ఇచ్చేశారు.
ఇక #RRR చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలయ్యే ఆస్కారం ఉన్న ఈ తరుణంలో ఎన్టీఆర్ స్పెషల్ డైట్ అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తనకి నచ్చేది వచ్చే వరకు ఎంత కష్టమైనా తట్టుకునే రాజమౌళి తన నటీనటులని కూడా అదే స్థాయిలో కష్టపడేలా చేస్తుంటాడు.
ఎన్టీఆర్ డైట్ అంశం ఈ విషయాన్నీ తేటతెల్లం చేస్తున్నది. ఎన్టీఆర్ పాత్రనే ఇలా ఆసక్తికరంగా ఉంటే మరో హీరో అయిన రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో అన్న ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.