చిత్రసీమని కరోనా కలవర పెడుతోంది. సెలబ్రెటీలు కరోనా బారీన పడుతున్నారు. బాలీవుడ్ లో కరోనా ఎఫెక్ట్ విపరీతంగా ఉంది. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాథ్య... వీళ్లంతా ఇప్పుడు కరోనా బారీన పడ్డారు. తాజాగా అర్జున్ కుమార్తె ఐశర్య అర్జున్ కి కరోనా పాజిటీవ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్జున్ సన్నిహితులు తెలిపారు.
2018లోనే ఐశ్వర్యచిత్రసీమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఒకటి, కన్నడలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ తమిళ సినిమా సెట్స్‌పై ఉంది. తెలుగులోనూ ఐశ్వర్య ఓ సినిమా చేయబోతోందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ.. ఒక్క ఆఫర్ కూడా రాలేదు.