ప్రభాస్ రాబోయే సినిమాలో కథానాయికగా దీపిక పదుకొణె ఎంట్రీ ఖాయమైపోయింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపిక ను కథానాయికగా ఎంచుకున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇలాంటి కాంబినేషన్ కోసమే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ - దీపికలను ఒకే ఫ్రేములో వెండి తెరపై చూడడం కనుల పండగే. అయితే ఈ సినిమా కోసం దీపికకు 30 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారన్నది షాక్ కలిగించే విషయం.
దీపిక ఈ సినిమాలో నటించడానికి 30 కోట్లు డిమాండ్ చేసిందని, అడిగినంత ఇవ్వడానికి వైజయంతీ మూవీస్ ఒప్పుకుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి దీపిక పారితోషికం రూ.15 కోట్ల లోపే. బాలీవుడ్ లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వరు. సౌత్ ఇండియాలో ఆఫర్లు వచ్చినప్పుడే ఇలా రెట్టింపు డిమాండ్ చేస్తుంటారు. దీపికకు 30 కోట్ల పారితోషికం మరీ ఎక్కువ.
కాకపోతే దీపికకు 20 కోట్లు ఇవ్వొండొచ్చని, దాన్ని 30 గా చెప్పుకుని చిత్రబృందం హైప్ క్రియేట్ చేస్తుందన్న మరో వాదనా వినిపిస్తోంది.పారితోషికం ఎంతైతే ఏంటి? ప్రభాస్ - దీపిక జంట ఖాయమైంది. ప్రభాస్ ఫ్యాన్స్కి అది చాలు.