ఇష్టం లేకున్నా ఆ హీరోకి చెల్లెలిగా..

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ టైమ్‌లోనే సావిత్రి తదితర స్టార్‌ హీరోయిన్లు ఎట్‌ ఏ టైమ్‌ కొన్ని సినిమాలకు ఆయా హీరోలతో జోడీ కట్టి, మరి కొన్ని సినిమాల్లో చెల్లెలి పాత్రలూ పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన సందర్భాలున్నాయి. కానీ, ఇప్పుడలా కాదు, స్టార్‌డమ్‌ దక్కించుకున్న హీరోయిన్స్‌, జోడీ కట్టిన హీరోలకు చెల్లెలి పాత్రలు పోషించడానికి ఇష్టపడడంలేదు. దాంతో చెల్లి పాత్రలకు సెపరేట్‌ ఆర్టిస్టులు ఫిక్స్‌ అయిపోయారు. కానీ, పాత తరాన్ని మళ్లీ గుర్తుకు తెస్తోంది ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్‌. స్వతహాగా తెలుగమ్మాయ్‌ అయినా, తమిళంలో బిజీగా గడుపుతూ, ఇప్పుడిప్పుడే తెలుగులోనూ అవకాశా లు దక్కించుకుంటోంది ఐశ్వర్యా రాజేష్‌.

 

‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’లో విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ, తమిళ స్టార్‌ హీరో ఇళయ దళపతి విజయ్‌కి చెల్లెలి పాత్ర పోషించేందుకు సిద్ధపడుతోందట. ఈ పాత్రను పోషించేందుకు మొదట్లో ఐశ్వర్యా నిరాకరించిందట. కానీ, విజయ్‌కి చెల్లెలిగా ఆ పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఉండడంతో ఒప్పుకోవల్సి వచ్చిందట. విజయ్‌కి ప్రియురాలిగా నటించి మురిసిపోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం విజయ్‌కి చెల్లెలిగా సరిపెట్టుకోవల్సి వస్తోంది. కానీ, త్వరలోనే ప్రియురాలిగా కూడా కనిపిస్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ప్రస్తుతం విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమాలో నటిస్తున్నారు.

 

ఈ సినిమా తర్వాత పాండిరాజ్‌ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమాలోనే ఐశ్వర్యా రాజేష్‌ చెల్లి పాత్ర పోషిస్తోందట. మరోవైపు ఐశ్వర్య తెలుగులో నటిస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS