ఫిబ్రవరి 21న నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సాంగ్ ప్రోమోు, పోస్టర్స్ రూపంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఇలా జరిగిన ప్రమోషన్స్ ద్వారా ‘భీష్మ’పై ఓ మోస్తరు బజ్ ఏర్పడింది. ఇక అసలు సిసలు బజ్ కోసం నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దించబోతున్నాడట. ఈ సినిమా ప్రమోషన్స్‌కి పవన్‌ని తీసుకురానున్నాడనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. నితిన్ నటించిన చాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి పవన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భాలున్నాయి. అలా పవన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన సినిమాలు నితిన్‌కి కలిసొచ్చాయి కూడా. అయితే, ఈ మధ్య పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్
వద్ద బోల్తా కొట్టడంతో ఈ సారి ఎలాగైనా తన సినిమా ఫంక్షన్‌కి పవన్‌ని రప్పించానుకుంటున్నాడట. పవన్‌కి నితిన్ భక్తుడన్న సంగతి తెలిసిందే. నితిన్ కోరితే పవన్ కాదనడు. ఎలాగూ, ఆయన ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. ఏకంగా మూడు ప్రాజెక్టు అనౌన్స్ చేసి, రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి మంచి జోరు మీదున్నారు. సో నితిన్ కోసం పవన్ కళ్యాణ్ వస్తాడనే అనిపిస్తోంది. అన్నట్లు నితిన్‌పై అభిమానంతోనే పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్‌లో నితిన్ హీరోగా ఓ సినిమా కూడా నిర్మించారు. బట్ బ్యాడ్‌లక్ ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందించలేదనుకోండి. ఇక తాజా మూవీ ‘భీష్మ’ విషయానికొస్తే, కూల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.