ఐశ్వర్యారాయ్ న్యూస్:-
వయసుతో పాటే అందం పెరిగిపోతోంది. ఐశ్వర్యారాయ్ అందం ముందు ఎవరైనా బలాదూర్ అంతే. అందుకే విశ్వసుందరి అంటే ఐశ్వర్యారాయ్ ఐశ్వర్యారాయ్ అంటే విశ్వసుందరి ఈ ట్యాగ్‌లైన్ మాత్రం ఛేంజ్ కావడం లేదు. అందుకే అందమైన అమ్మాయి కనిపిస్తే, ఆహా ఐశ్వర్యారాయ్ అంత అందంగా ఉందిరా..!
అంటూ ముందుగా పోల్చేది ఐశ్వర్యారాయ్తోనే. అందానికి అలా కొత్తర్ధం తీసుకొచ్చింది ఐశ్వర్యా. అమితాబ్ కోడలిగా, అభిషేక్ బచ్చన్ భార్యగా బచ్చన్ ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చి, ఆరాధ్యకు తల్లి అయినా ఆమె అందంలో వీసమెత్తైనా మార్పు రాలేదు.
అంతంతకూ పెరిగిపోతున్న ఆమె అందాన్ని చూసి ముద్దుగుమ్మలెవరైనా అసూయ చెందాల్సిందే. అదీ ఐశ్వర్యారాయ్ గ్లామర్ అంటే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం తీసిపోకుండా అవకాశాలు దక్కించుకుంటోంది. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఒకే రకమైన ఫాలోయింగ్‌నీ క్రేజ్‌నీ తన ఖాతాలో వేసుకుంటోంది అందాల ఐశ్వర్యారాయ్.