'నోటా' సినిమాకి తొలి రోజు, తొలి షో నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ బయటకు వచ్చేసినా, ఓపెనింగ్స్‌లో పెద్దగా ఫరక్ పడలేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల షేర్‌ని 'నోటా' వసూలు చేసింది.
ఇది తెలుగు వెర్షన్ షేర్ మాత్రమే. ఓవర్సీస్‌లో 80 లక్షల వరకు ఫస్ట్ డే వసూళ్ళు వచ్చాయి. నైజాంలో రెండు కోట్లకు దగ్గరగా వచ్చాడు విజయ్ దేవరకొండ 'నోటా'తో. నాని - నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన 'దేవదాస్' తొలి రోజు చేసిన వసూళ్ళతో పోల్చితే, అంతకన్నా ఎక్కువ వసూళ్ళను విజయ్ 'నోటా'తో సాధించడం గమనార్హం. 'దేవదాస్' తొలి రోజు వసూళ్ళు 7 కోట్ల లోపే వున్నాయి.
ఇదిలా వుంటే 'నోటా' వసూళ్ళు రెండో రోజు గణనీయంగా పడిపోయినట్లుగా టాక్ విన్పిస్తోంది కొన్ని చోట్ల. అయితే మరికొన్ని చోట్ల మాత్రం బుకింగ్స్ స్ట్రాంగ్‌గానే వున్నాయట. ఓవరాల్‌గా ఈ వీకెండ్ వసూళ్ళు 'నోటా'కి ఆశాజనకంగానే వుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా 'సేఫ్ జోన్'లోకి వెళ్ళిపోయినట్లేనన్నది వారి అభిప్రాయం. నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయి వసూళ్ళంటే చిన్న విషయం కాదు. ఇది విజయ్ స్టామినాకి నిలువుటద్దంగా అభివర్ణించొచ్చు.
మరో పక్క విజయ్ అభిమానులు.. అదేనండీ 'రౌడీస్', 'నోటా' సినిమాని పైకి లేపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతర హీరోల అభిమానులతో రౌడీస్ ఫైట్ కొనసాగుతూనే వుంది.