తెరపై ఓ పక్క నటనలో రాణిస్తూనే ముద్దుగుమ్మలు తెర వెనుక కార్యకలాపాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. బాలీవుడ్‌లో అనుష్కాశర్మ తదితరులు ఆల్రెడీ ఈ రకంగా సక్సెస్ అయ్యారు. హీరోయిన్స్‌గా తెరపై సత్తా చాటుతూనే, నిర్మాణ రంగంలోనూ అభిరుచిని చాటుకుంటున్నారు. తాజాగా విశ్వసుందరి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ సతీమణి అయిన ఐశ్వర్యారాయ్ కూడా తన మనసులోని కోరికను అభిమానుల ముందుంచింది.
అందాల దేవతగా కుర్రోళ్ల మదిలో పదిలమైన గూడు కట్టుకున్న ఐశ్వర్యారాయ్ అభిషేక్‌ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లై, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రీ ఎంట్రీలోనూ వన్నె తరగని గ్లామర్‌తో, మంచి నటనతో ఆకట్టుకుంటోంది. ఇక అతిత్వరలోనే అందాల ఐశ్వర్య మెగాఫోన్ పట్టే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. దర్శకత్వ విభాగంలో రాణించేందుకు తగిన అర్హతలు తనకున్నాయనీ, అయితే పూర్తి ప్రావీణ్యం పొందిన తర్వాతే ఆ ప్రయత్నం చేస్తానంటోంది. కానీ ఎలాగైనా దర్శకత్వం చేపట్టాలనేది తన కోరిక అంటోంది.
ఆ ప్రయత్నానికి తన ఫ్యామిలీ నుండి పూర్తి సపోర్ట్ ఉందనీ ఐశ్వర్య బచ్చన్ చెబుతోంది. ప్రస్తుతం మంచి మంచి కథలు వస్తున్నాయనీ, నటనపై పూర్తిగా కాన్‌సన్‌ట్రేషన్ చేసి, హీరోయిన్‌గా మరిన్ని మంచి సినిమాల్లో నటించి అప్పుడు పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పేసి, తన మదిలో కోరిక నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుందట. అందుకు మరికొంత సమయం పట్టేలా ఉందంటోంది.
ఇటీవలే 'ఫన్నేఖాన్' సినిమాతో ఐశ్వర్యారాయ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.