నిమ్మకూరులో 'ఎన్టీఆర్‌': పోటెత్తిన అభిమానం

By iQlikMovies - August 04, 2018 - 10:27 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ సొంతూరు నిమ్మకూరులో బాలయ్య సందడి చేశారు. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో బాలయ్యతో పాటు, దర్శకుడు క్రిష్‌ కూడా నిమ్మకూరులో పర్యటించారు. నిమ్మకూరులోని లొకేషన్స్‌ని పరిశీలించారు. అలాగే ఎన్టీఆర్‌ భార్య బసవతారకం సొంతూరులోనూ కొన్ని లొకేషన్స్‌ని పరిశీలించారు. 

నిమ్మకూరులో బాలయ్య అండ్‌ క్రిష్‌ని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాలయ్య స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అత్యంత ప్రాధాన్యత గల ఎన్టీఆర్‌ భార్య 'బసవతారకం' పాత్రలో నటిస్తోంది. 

'ఎన్టీఆర్‌' జీవిత చరిత్రలో మరో కీలకమైన పాత్ర అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర. ఈ పాత్ర కోసం యంగ్‌ హీరో రానాని ఎంచుకున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని తాజాగా రానా తన ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశాడు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానాపై టెస్ట్‌ షూట్‌ చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌కి రానా హాజరు కానున్నాడు. 

అలాగే ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుని పాత్రలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు నటిస్తున్నారు. మహేష్‌బాబు, నాగచైతన్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారమ్‌.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS