ఈ సన్నివేశం ఏదో సినిమాలోది కాదు, ఇది అచ్చంగా ఐశ్వర్యా రాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన.
వివరాల్లోకి వెళితే, హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయిన హర్వే వైన్ స్టైన్ పైన ఇప్పుడు అక్కడ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవేంటంటే- తన చిత్రాలలో చేసిన నటీమణులని లోబరుచుకునేవాడు అని అలాగే ఒకసారి ఐశ్వర్యా తన భర్త తో కలిసి ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఈ సదరు నిర్మాత ఐశ్వర్యని ఏకాంతంగా కలిపించే ప్రయత్నం చేయమని ఆమె మాజీ మేనేజర్ అయిన సిమొన్ ని బాగా ఒత్తిడి చేశాడట.
అయితే అందుకు ఆ మేనేజర్ ఒప్పుకోకుండా ఆ విషయాన్ని ఐశ్వర్య వరకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డానని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపింది.
ఇప్పటికే అనేకమంది నటీమణులు తమని భయపెట్టి లోబర్చుకున్నాడు అని ఇందుకు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.