ఐశ్వర్యా రాయి బచ్చన్- ఒకప్పుడు నటిగానే పెరుపొందినా ప్రస్తుతం బచ్చన్ కి బహు గా సంఘంలో అదనపు గుర్తింపు కూడా దక్కించుకుంది.
అయితే ఈ మధ్యనే ఆమె నటించిన ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఆమె నటించిన శృంగార భరిత సన్నివేశాల పై ఆమె కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్న వార్తలు బయటకి వచ్చాయి. ఇక దీనికే ఆమె ఇక పై నటించే చిత్రాలలో రొమాంటిక్ సీన్స్ చేయకుండా ఉండాలి అని నిర్ణయించుకుందట.
దీనికి తాజా ఉదాహరణే, ఆమె నటిస్తున్న ఫ్యానీ ఖాన్ చిత్రంలో హీరో రాజ్ కుమార్ రావుతో రొమాంటిక్ సీన్స్ లో నటించనని తెగేసి చెప్పిందట. దీనితో సదరు చిత్ర యూనిట్ చేసేది లేక ఆ సీన్స్ ని తీసేసి షూటింగ్ జరుపుతున్నదట.