`అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. అప్పుడే.. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ చక చక సాగిపోతున్నాయి. పాత్రధారుల ఎంపిక జోరందుకుంది. బీజూ మీనన్ పాత్రని పవన్ కల్యాణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ పాత్ర కోసం నలుగురు పోటీ పడుతున్నారు. రానా, నితిన్, సుదీప్, విజయ్ సేతుపతిలలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కథానాయికగా సాయి పల్లవిని ఫిక్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది.
అదే.. ఐశర్వ రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్. నటనకు ప్రాధాన్యం ఉన్న కథానాయిక పాత్రలకు మంచి ఆప్షన్. అందుకే ఈ సినిమాలో ఐశ్వర్యని ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. అయితే సాయి పల్లవి స్థానంలో ఐశ్వర్యని తీసుకున్నారా? లేదంటే.. సాయి పల్లవితో పాటు ఐశ్వర్య కూడా నటిస్తోందా? అనేది తేలాల్సివుంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.