అల్లు అర్జున్ - సుకుమార్ ల హ్యాట్రిక్ సినిమా... `పుష్ష`. ఇందులో కథానాయికల హంగామా ఎక్కువగా నే కనిపించబోతోంది. బన్నీకి జోడీగా రష్మిక కనిపించనున్న సంగతి తెలిసిందే. అనసూయ ఓ కీలకమైన పాత్రలో దర్శనమివ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ ఊర్వశీ రౌటాలా ప్రత్యేక గీతంలో మెరవబోతోంది. వీళ్లు కాకుండా ఇందులో మరో హీరోయిన్ కూడా మెరవబోతోందట. తనే... ఐశ్వర్యా రాజేష్. `వరల్డ్ ఫేమస్ లవర్`లో విజయ్ దేవరకొండ సరసన నటించింది ఐశ్వర్య.
ఈ సినిమాలో బన్నీకి చెల్లాయిగా నటించబోతోందట. చెల్లెలు పాత్ర ఈ కథకు చాలా కీలకమని, తన చావుకు కారణమైన ఓ పోలీస్ ఆఫీసర్ పై హీరో ఎలా రివైంజ్ తీర్చుకున్నాడు? అన్నది ఓ ట్రాక్ గా తెరపైకి వస్తుందని, అందుకే ఆ పాత్రకు గానూ... ఐశ్వర్య రాజేష్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్ కి ఓ కీలకమైన పాత్ర దక్కిన సంగతి తెలిసిందే.