తెలుగు చిత్రసీమ అందించిన మరపురాని చిత్రాల్లో `మాతృదేవోభవ` ఒకటి. మాధవి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్టు. మహిళా లోకాన్ని థియేటర్లకు రప్పించిన సినిమాగా మిగిలింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టనివాళ్లు లేరంటే నమ్మాల్సిందే. `మాతృదేవోభవ` విడుదలై... మూడు దశాబ్దాలైంది. ఇప్పుడు ఈ సినిమాని మరోసారి రీమేక్ చేయాలని కె.ఎస్.రామారావు భావిస్తున్నార్ట. అప్పట్లో మాధవిని సరికొత్త కోణంలో చూపించిన కథ ఇది.
ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందన్నది నిర్మాత అభిప్రాయం. అనుష్క మొదటి ఆప్షన్ అట. ఆ తరవాత... సమంత, కీర్తి సురేష్‌లు వస్తార్ట. వీళ్లలో ఎవరు చేసినా బాగుంటుందని దర్శక నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. కాకపోతే.. `మాతృదేవోభవ` ఓ సెంటిమెంట్ ఫిల్మ్. అంతటి సెంటిమెంట్ ఈ తరం తట్టుకోగలదా? అనేది పెద్ద అనుమానం. పైగా... అంత భారమైన పాత్రని అనుష్క, కీర్తి, సమంతలు పోషిస్తారని అనుకోవడం కూడా అత్యాసే. మరి.. మిగిలిన హీరోయిన్లలో ఎవరైనా ముందుకొస్తే... ఈ సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేసేయొచ్చు.