స్టామినా చూపించిన తెలుగమ్మాయ్‌.!

By Inkmantra - February 14, 2020 - 16:10 PM IST

మరిన్ని వార్తలు

డబ్బింగ్‌ సినిమా ‘కౌసల్యా కృష్ణమూర్తి’తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది తెలుగమ్మాయ్‌ ఐశ్వర్యా రాజేష్‌. ఐశ్వర్యా రాజేష్ నటించిన తొలి స్ట్రెయిట్‌ టాలీవుడ్‌ మూవీ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రిలీజ్‌కి ముందు ఈ సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్‌ రాశీఖన్నాకే అనుకున్నారంతా. వాస్తవానికి ఆ మాట నిజమే. కానీ, ఆడియన్స్ మనసు కొల్లగొట్టడంలో రాశీకి పోటీగా ఐశ్వర్యా నిలిచింది. మూడు వేరియేషన్స్‌లో సాగే లవ్‌ స్టోరీస్‌లో ఇల్లెందు నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ సినిమాకి హైలైట్‌ అంటూ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా వీక్షకులు మాట్లాడుకుంటున్నారు.

 

ఈ ట్రాక్‌లో శీనయ్యగా విజయ్‌ ఆకట్టుకుంటే, సువర్ణగా ఐశ్వర్యా రాజేష్‌ తన నటనతో కట్టి పడేసింది. ఈ ట్రాక్‌ ఇంకాస్త ఎక్కువ సేపు ఉంటే బాగుండని ఆడియన్స్‌ భావిస్తున్నారంటే, ఎంతలా ఈ పాత్రలు సగటు ప్రేక్షకున్ని కట్టి పడేశాయో అర్ధం చేసుకోవచ్చు. ఐశ్వర్యా విషయానికి వస్తే, నిడివి తక్కువ ఉన్న పాత్రలో కనిపించినా, ఆ పాత్రకు ఐశ్వర్యను ఎంచుకుని చాలా మంచి పని చేశారు. ఆ పాత్రలో ఆమెను తప్ప మరో హీరోయిన్‌ని ఊహించలేం అన్నంతలా ప్రశంసలు దక్కించుకుంటోంది. ఎంతైనా తెలుగమ్మాయ్‌ కదా.. తన స్టామినా చూపించిందంతే. సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా ఇలాంటి పాత్రలే నటీ నటుల స్టామినా బయటపడేలా చేస్తుంటాయి.

 

తొలి ప్రయత్నంలో ఐశ్వర్యా ఆ స్టామినాని ప్రూవ్‌ చేసుకుంది కాబట్టి, టాలీవుడ్‌లో నెక్స్‌ట్‌ ఆఫర్స్‌ ఈజీగానే దక్కించుకుంటుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS