వారసుడి ఎంట్రీపై ఈ గుసగుస నిజమేనా.?

మరిన్ని వార్తలు

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఎప్పటి నుండో అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి . తాజాగా వినిపిస్తున్న మౌత్‌ టాక్‌ ద్వారా వారసుడికి అసలు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ లేదని తెలుస్తోంది. బిజినెస్‌ థాట్స్‌లో మోక్షజ్ఞ ఉన్నాడు తప్ప, యాక్టింగ్‌ అంటే చిన్నప్పటి నుండీ ఇంట్రెస్ట్‌ లేదని మాట్లాడుకుంటున్నారు. కానీ, నందమూరి వంశంలో ఎన్టీఆర్‌ తర్వాత బాలయ్య ఆ లెగసీని కంటిన్యూ చేశారు. ఆయన తర్వాత ఆ వారసత్వం నిబెట్టాలంటే, మోక్షజ్ఞ ఖచ్చితంగా సినిమాల్లోకి రావల్సిందే.. అంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోందట. కానీ, మోక్షజ్ఞ నటనపై ఎలాంటి ఆసక్తి కనబరచడం లేదనే తాజా గుసగుస నందమూరి అభిమానుల్ని కలవరపెడుతోంది.

 

ఇక లేటెస్ట్‌గా వారసున్ని ఎలాగోలా బుజ్జగించి, నచ్చచెప్పి యాక్టింగ్‌కి కమిట్‌ చేయించారనీ, ఆ క్రమంలోనే ప్రస్తుతం న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కించి, అక్కడి యాక్టింగ్‌ ధియేటర్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారనీ ఫిలిం వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బాలయ్య 100 వ సినిమా దగ్గర నుండీ వారసుడు ఇదిగో వచ్చేస్తున్నాడు.. అదిగో వచ్చేస్తున్నాడు.. అంటూ ఊదరగొట్టారే తప్ప ఇంతవరకూ ఆ ముచ్చట తీరనే లేదు. వారసుడు ఈ సారేం చేస్తాడో చూడాలి మరి. ఇక ప్రస్తుతం బాలయ్య తన 106 వ సినిమాతో బిజీగా ఉన్నారు. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS