తమిళ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్. తమిళ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది. మల్టీ టాలెంటెడ్. కమల్ కుమార్తె శృతిహాసన్‌లా దేనికైనా రెడీ అంటోంది. గ్లామర్ షో అయినా యాక్షన్ ఇమేజ్ అయినా తనకు ఓకే అని చెబుతూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఆఫర్లు ఇవ్వడమే తరువాయి. టాలీవుడ్‌లో హీరోయిన్స్ కొరత ఉన్న కారణంగా ఈ అమ్మడు ఒక్కసారి తెలుగులో ఎంట్రీ ఇచ్చిందంటే చాలు. దూసుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువే. అందులోనూ గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మాయే. టాలెంట్‌కి ఎప్పుడూ టాలీవుడ్‌లో తలుపులు తెరచే ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో హీరోయిన్స్‌కి టాలెంట్ సక్సెస్ హీరోయిన్ అనిపించుకోవడానికి బాగా తోడ్పడుతోంది. అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకులకు తన టాలెంట్‌ని పరిచయం చేసే రోజు ఎప్పుడొస్తుందో చూద్దాం!