RX100 డైరెక్టర్ కి ఖరీధైన బహుమతి

మరిన్ని వార్తలు

RX 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఆ సినిమా ప్రేక్షకుల మనసులనే గాక బాక్స్ ఆఫీస్ ని కూడా గెలుచుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రూ 15 కోట్ల (షేర్) ఈ చిత్రం వసూలు చేసిందట, దీనితో ఈ చిత్ర నిర్మాత.. ఇంతటి ఘనవిజయాన్ని తనకి అందించిన దర్శకుడు అజయ్ భూపతికి ఖరీదైన జీప్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చాడు.

ఇప్పుడు ఈ విషయాన్నీ ఇండస్ట్రీలో అందరూ “ బైక్ చూపించి కారు పట్టుకెళ్ళిపోయాడు” అని సరదాగా అంటున్నారు. సినిమాలు అనూహ్య విజయాన్ని సాధించి నిర్మాతకి కాసుల వర్షం కురిపించినప్పుడు దర్శకులకి ఇటువంటి బహుమతులు రావడం సర్వసాధారణం.

ఇక తాజాగా అజయ్ భూపతి ఈ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS