మ‌హా స‌ముద్రంలో.. మునిగేది ఎవ‌రు?

మరిన్ని వార్తలు

ఆర్‌.ఎక్స్ 100తో ఓ సునామీలా విరుచుకుప‌డిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్‌భూప‌తి. ఆ సినిమా త‌ర‌వాత‌.. మ‌హా స‌ముద్రం స్క్రిప్టు ప‌ట్టుకుని చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు. అన్నీ ఓకే... షూటింగు మొద‌లు - అనుకునే స‌మ‌యానికి ఏదో ఓ బ్రేక్‌. అలా.. రెండో సినిమా విష‌యంలో పురిటి నొప్పులు అనుభ‌వించాల్సివ‌చ్చింది. చివ‌రికి శ‌ర్వానంద్ ఈ క‌థ‌కు ఓకే చెప్పాడు. లాక్ డౌన్ ఎత్తేశాక‌.. ప‌ట్టాలెక్కే శ‌ర్వా సినిమా ఇదే. స్క్రిప్టు ఇప్ప‌టికే లాక్ చేసేశారు. ఇప్పుడు క‌థానాయిక కూడా ఫిక్స‌యిపోయిన‌ట్టు టాక్‌.

 

అతిథి రావు హైద‌రీని ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎంచుకున్నార్ట‌. క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. గ్లామ‌ర్ తో పాటు అభిన‌యం కూడా అవ‌స‌రం. అందుకే అతిథిని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. శ‌ర్వా - అతిథి క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడిగా సిద్దార్థ్ ని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న కోసం మ‌రో హీరోయిన్ ని వెద‌కాల్సివుంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS