డైరెక్షన్‌లో రామ్‌గోపాల్ వర్మ రూటే సెపరేటు. ప్రతీ సినిమాకి ఏదో ఒక కొత్త సాంకేతికతను పరిచయం చేసేవాడు రామ్‌గోపాల్ వర్మ. అందుకే డైరెక్టర్‌గా రామ్‌గోపాల్ వర్మ అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ప్రతీ ఒక్కరిలో. కొత్తగా డైరెక్టర్స్ అయ్యేవారికి వర్మ ఓ ఇన్స్‌పిరేషన్ అని చెప్పొచ్చు. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసి, డైరెక్టర్స్‌గా సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు.
ఈ కోవలో తాజాగా మరో డైరెక్టర్ చేరాడు. ఆయనే అజయ్ భూపతి. వర్మ తెరకెక్కించిన 'వీరప్పన్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు అజయ్ భూపతి. ఈయన ఇప్పుడు డైరెక్టర్‌గా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే 'ఆర్ ఎక్స్ 100'. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అమ్మాయి అబ్బాయి మధ్యలో ఓ బైక్ ఈ నేపథ్యం చుట్టూ సాగే స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్టుగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. చాలా రగ్గ్‌డ్ లుక్‌లో ట్రైలర్‌ని కట్ చేశారు. విలేజ్ నేటివిటీని చాలా అందంగా చూపించారు. అలాగే రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య హాట్ హాట్ సన్నివేశాల్ని చాలా హృద్యంగా చూపించారు.
ఇప్పుడీ ట్రైలర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది. డిఫరెంట్ జోనర్‌లా అనిపిస్తున్న ఈ చిత్రంతో డైరెక్టర్‌గా తొలి సక్సెస్‌ని అందుకుంటాడేమో వర్మగారి శిష్యుడు చూడాలిక.