ప్రబాస్ తెలుగు మాస్టారైపోయారు. అదేంటి? అనుకుంటున్నారా? అవును ప్రస్తుతం ప్రబాస్ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రబాస్‌తో పాటు ఇతర భాషా నటీనటులు చాలా మంది నటిస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఇంగ్లీషు పాప ఎవ్లిన్ శర్మ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాపకు పాపం తెలుగు రాదు కదా. అందుకే ప్రబాస్ ఈమెకు తెలుగు నేర్పిస్తున్నాడట.
మరో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈయనకి కూడా ప్రబాసే తెలుగు నేర్పిస్తున్నాడట. అలా ప్రబాస్ 'సాహో' సినిమాకి సంబంధించి, తెలుగు మాస్టార్ అవతారమెత్తాడన్న మాట. ఇకపోతే సినిమా విషయానికి వస్తే, ఎక్కడా డూప్స్ లేకుండా, నేచురల్‌గా యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నాడు ప్రబాస్.
ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లేటెస్టుగా ఓ ఛేజింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో నటిస్తున్నప్పుడు ప్రబాస్ చాలా భయపడ్డాడట. తొలిసారి యాక్షన్‌లో డూప్స్ లేకుండా నటించాడు ప్రబాస్. చాలా థ్రిల్ ఫీలయ్యాడట. ఈ సీన్‌ని స్క్రీన్‌పై చూసిన ప్రతీ ఒక్కరూ అంతే థ్రిల్ ఫీలవుతారనీ అంటున్నాడు ప్రబాస్.
ఇకపోతే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో ప్రబాస్‌తో పాటు, శ్రద్దా కూడా యాక్షన్ సీన్స్‌తో సత్తా చాటనుంది. భారీ బాలీవుడ్ కాస్టింగ్‌తో 'బాహుబలి' తర్వాత తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.