`ఆదిపురుష్‌`లో ఆయ‌న లేడా?

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా సినిమా `ఆది పురుష్‌`. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో మ‌రో కీల‌క‌మైన పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ ని ఎంచుకున్నారు. హ‌నుమంతుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్‌ని ఎంచుకున్నార‌ని, ఆయ‌న రాక‌తో - ఈ సినిమాకి మ‌రింత బ‌లం తోడైంద‌ని చెప్పుకుంటున్నారంతా. అయితే ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

 

నిజానికి ఈ సినిమాలో అజ‌య్ లేడ‌ట‌. అదంతా ఉత్తి పుకారే అని తెలుస్తోంది. బాలీవుడ్ కి చెందిన కొంత‌మంది ప్ర‌ముఖ న‌టులు ఈ సినిమాలో న‌టిస్తార‌ని, అయితే అందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ మాత్రం ఉండ‌డ‌ని స‌మాచారం. టాలీవుడ్ నుంచి కూడా కొంత‌మందిని కీల‌క పాత్ర‌ల కోసం ఎంచుకుంటున్నార‌ని స‌మాచారం. సీత పాత్ర లో ఎవ‌రిని ఎంచుకుంటారో చూడాలి. ఆ పాత్ర కోసం గ‌ట్టి పోటీ ఉంది. కీర్తి సురేష్‌, అనుష్క లాంటి స్టార్ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. 2020 ప్ర‌ధ‌మార్థంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS