కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో టాప్ స్టార్ అయిన తల అజిత్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన స్టామినా ఏమిటో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఏమైనా అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ చిత్రాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో విశ్వాసం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన రీసెంట్ గా నెర్కొండ పార్వై అనే సినిమాలో లాయర్ గా నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
అజిత్ ఇటీవలే ఓ నూతన చిత్రాన్ని ప్రకటిచడంతో పాటు, పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. కాగా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరడంతో వచ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. నెర్కొండ పార్వై సినిమాని తెరకెక్కించిన హెచ్ వినోత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం విశేషం.
మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ చేశే అవకాశం ఉంది. ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఏమైనా అజిత్ వరుస హిట్స్ తో బిజీ అవుతొన్నాడు.