సురేంధర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా లాంటి పాన్ ఇండియా మూవీ తీసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సైరా తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. మరి సురేంధర్ రెడ్డి తర్వాత సినిమా ఎవరితో చేయనున్నారు అనే విషయం పై ఇప్పటికే అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆయనైతే స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సురేంధర్ రెడ్డి వెంటనే మూవీ స్టార్ చేయాలంటే టాలీవుడ్ కుర్ర హీరోలలో ఒకరిద్దరు సిద్ధంగనే ఉన్నారు. అదే స్టార్ హీరోతో సినిమా చేయాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
మహేష్, బన్నీ కొద్దిరోజులలో తమ సంక్రాంతి సినిమాల షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఐతే బన్నీ నెక్స్ట్ సుకుమార్ తో కమిటైపోగా, మహేష్ మళ్ళీ వంశీ పైడిపల్లితో మూవీ చేయాలని చూస్తున్నారడు. ఇక ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ నుండి ఎప్పుడు బయటపడతారో ఇప్పుడే చెప్పలేం. చివరికి కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ కూడా గోపీచంద్ మలినేని చిత్రాన్ని మొదలుపెట్టారు. మొత్తానికి ప్రభాస్ అయితేనే సురేంద్ర రెడ్డికి త్వరగా మూవీ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఈ దర్శకుడు కూడా భావిస్తున్నారట.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమా ఇప్పటికే 20-30 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే వేసవి చివరికల్లా ప్రభాస్ ఈ సినిమాని పూర్తి చేసే అవకాశం కలదు. ఎటూ ఇకపై ప్రభాస్ వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు కాబట్టి, మరి సురేంధర్ రెడ్డి స్క్రిప్ట్ కనుక నచ్చితే వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే సురేంధర్ రెడ్డి... ప్రభాస్ ని మెప్పించే దిశగా స్క్రిప్ట్ పనులు చేస్తున్నాడు.