తమిళ హీరో అజిత్ నటిస్తోన్న చిత్రం 'వివేగం'. ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. మామూలు రికార్డులు కాదు వరల్డ్ రికార్డు సృష్టించింది. మూడు నెలల కిందట విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకూ 1.90 కోట్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. 5,24,872 వేల లైకులు కొట్టేసింది. మూడు నెలల్లో ఇన్ని లైకులతో ప్రథమ స్థానం సంపాదించిన 'వివేగం' టీజర్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతవరకూ యూ ట్యూబ్‌లో 'మార్వెలిన్ ఆవెంజర్స్' అనే ఓ టీజర్ ప్రధమ స్థానంలో ఉన్నట్లు సమాచారమ్. అయితే అది విడుదలైన మూడు సంవత్సరాలకు ఎనిమిది కోట్ల వ్యూస్ అందుకుంటే, అజిత్ నటిస్తోన్న 'వివేగం' మాత్రం మూడు నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ సక్సెస్‌ల మీదున్నాడు అజిత్. లవర్ బోయ్‌గా పాపులరైన అజిత్, సెకండ్ ఇన్నింగ్స్‌లో నేచురల్ లుక్‌లో యాక్షన్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఆయన విజయాలకు తిరుగే లేకుండా పోయింది. త్వరలోనే 'వివేగం'తో మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోతున్నాడు రొమాంటిక్ హీరో అజిత్. తమిళ, తెలుగు భాషల్లో ప్రీ రిలీజ్ 'వివేగం' సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతోంది.