లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న అజిత్ యాక్షన్ హీరో అయిపోయాడు. యాక్షన్ అంటే అలా ఇలా కాదు. బీభత్సమైన యాక్షన్. గతంలో అజిత్ నుండి వచ్చిన 'వేదాలమ్', వీరం' సినిమాలతో అజిత్ యాక్షన్‌ని చూసేశాం. అయితే లేటెస్టుగా అజిత్ నుండి రాబోతున్న సినిమా 'వివేగం'. వాటన్నింటినీ మించి ఉండబోతోందట. ఈ సినిమాలోని స్టంట్స్ అద్భుతంగా తీర్చి దిద్దారట డైరెక్టర్. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'వేదాలమ్', వీరమ్' సినిమాలతో అజిత్ - శివ కాంబినేషన్ సక్సెస్ కాంబినేషన్ అయిపోయింది. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్‌ని కట్ చేశాడు డైరెక్టర్ శివ. ట్రైలర్ చూస్తుంటే అజిత్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. అలాగే విజువల్‌గా యాక్షన్ సీన్స్ హాలీవుడ్ యాక్షన్ సీన్స్‌ని తలపిస్తున్నాయి. అలాగే అజిత్ లుక్ గురించి మాట్లాడుకోక తప్పదు. మెరిసిన జుట్టుతోనే ట్రెండ్ సెట్ చేసేశాడు అజిత్. అదే ఇప్పుడు స్టైల్ అయిపోయింది. తెల్లజుట్టు అజిత్‌కి కలిసొచ్చింది. అందుకే సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నాడు. ఈ సినిమాకీ అదే స్టైల్‌ని కంటిన్యూ చేస్తూ మరింత స్టైలిష్ లుక్‌లో అజిత్ కనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ ఈ సినిమాలో అజిత్‌తో జత కడుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'వివేగం'.