'పైసా వసూల్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి సర్వం సిద్ధమయ్యింది. ఖమ్మంలో ఈ రోజు ఈ వేడుక ఘనంగా జరగబోతోంది. బాలయ్య - పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పైసా వసూల్'. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ అంచనాలును పెంచేస్తోంది. బాలయ్య డైలాగులు, యాక్షన్ అన్నీ ఇరగదీసేస్తున్నారు. పూరీ సినిమాల్లో గ్లామర్‌కి ఏమాత్రం లోటుండదు. అలాగే ఈ సినిమాలోనూ ముగ్గురు ముద్దుగుమ్మలతో బీభత్సమైన గ్లామర్‌ని పండించేశాడు పూరీ. శ్రియ, కైరాదత్, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియో ఫంక్షన్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారట. ఖమ్మంలో ఆడియో వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారు. మరో పక్క బాలయ్య నంధ్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అభిమానుల మధ్యకు వెళ్లి, సినీ డైలాగులతో ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు పాల్గొంటున్నారు. ఈ ఏజ్‌లోనూ బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో యూత్‌కి ధీటుగా డాన్సులు, ఫైట్లు ఇరగదీసేశారట ఈ సినిమాలో. చిత్ర యూనిట్ ఆయన ఎనర్జీకి ఫిదా అయిపోయారు.