'పైసా వసూల్' సినిమా తర్వాత పూరీ జగన్నాధ్ తీయబోతున్న చిత్రం 'మెహబూబా'. అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఈ సినిమాని పూరీ అభివర్ణించారు. ఇంతవరకూ పూరీ చేసిన సినిమాలు ఒకెత్తు. ఇదొక్కటి ఒకెత్తు అని ఆయనే చెప్పారు. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమిది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో జరగుతోంది. సుమారు 18000 అడుగుల ఎత్తులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంత ఎత్తులో షూటింగ్ చిత్ర యూనిట్‌కి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందట. అయితే అంత ఎత్తులో షూటింగ్ అంటే థ్రిల్‌తో పాటు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. ప్రకృతి అందాల సంగతి అంలా ఉంచితే, ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతి. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అంది. ఎముకలు కొరికే చలి ప్రాంతం. ఫుడ్ కూడా అంత ఈజీగా దొరకని ప్రదేశం ఇది. ఇలాంటి ప్రాంతాన్ని పూరీ షూటింట్‌కి ఎంచుకున్నారు. సుమారు 200 మంది టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారట. ఎంత కష్టమైనా కానీ ఇష్టంగానే భావించి చేస్తున్నారట. పూరీ తనయుడు ఆకాష్ పూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చాలా కొత్త కాన్సెప్ట్ మూవీ ఇది. దేశభక్తి మిళితమైన సినిమా. ఇటు డైరెక్టర్‌గా పూరీకి, అటు హీరోగా ఆకాష్ పూరీకి ఓ కొత్త అనుభూతిని మిగల్చనుంది ఈ సినిమా. పూరీ సినిమాలన్నింటి కన్నా భిన్నంగా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ నేహా శెట్టి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది.