దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండగలు, సమ్మర్ వంటి లాంగ్ హాలీడే వెకేషన్స్‌లో ఎన్ని సినిమాలొచ్చినా, బాక్సాఫీస్‌కి కాసుల పండగే. అలాంటిది స్టార్ హీరో సినిమాలకైతే వసూళ్ల పండగే పండగ. ఈ సారి వేసవికి సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు నువ్వా నేనా అంటూ పోటీ పడనున్నారు. ఈ పోటీ ఆరోగ్యకరమైనదే. ఏప్రిల్ 27న ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలతో వచ్చి ఫాన్స్‌కి కూల్ కూల్ సమ్మర్ ఎంజాయ్‌మెంట్‌ని ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాని ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నామని చిత్ర యూనిట్ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే తెలిపింది. కాగా తాజాగా మహేష్‌బాబు 'భరత్ అనే నేను' చిత్రానికి ఇదే డేట్‌ని ఫిక్స్ చేసిని సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. సో ఇటు మహేష్ ఫ్యాన్స్‌కీ, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఈ సమ్మర్ సో స్పెషల్. పండగే పండగన్న మాట. ఇటీవలే అల్లు అర్జున్ 'డీజె'తో హిట్ అందుకున్నాడు. మరో పక్క 'స్పైడర్' అంటూ వచ్చి మహేష్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు 'భరత్ అను నేను'లో ముఖ్యమంత్రి పాత్రలో ఆకట్టుకోనున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు. సో బన్నీ, మహేష్ ఇద్దరికీ ఈ రెండు సినిమాలూ ప్రత్యేకమైనవే! ఈ ఏడాదే మహేష్, బన్నీ పోటీ పడాల్సి ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'డిజె - దువ్వాడ జగన్నాథమ్', మహేష్ నటించిన 'స్పైడర్' ఒకే రోజు విడుదల కావాల్సి ఉండగా, 'స్పైడర్' వెనక్కి వెళ్ళింది. సో, 2018లో అయినా ఈ ఇద్దరి మధ్యా పోటీ ఉంటుందో లేదో చూడాలిక.