అఖండతో... టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించాయి. కొంగొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో నిర్మాత ఎంత లాభపడ్డాడో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే దిల్ రాజు మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే... అఖండ నైజాం, వైజాగ్ రైట్స్‌ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తొలి వారాంతంలోనే ఆ డబ్బుల్ని తిరిగి రాబట్టుకున్నారు. అఖండతో దిల్ రాజు ఖాతాలో కనీసం 5 నుంచి 6 కోట్ల లాభాలు పడబోతున్నాయన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అందుకే ఇప్పుడు ఆ ఖుషీని.. చిత్రబృందంతో షేర్ చేసుకున్నారాయన.
దిల్ రాజు హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఓ భారీ విందుని ఇచ్చారు. ఈ విందుకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ప్రగ్యాజైస్వాల్ తో పాటు... కీలకమైన సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో భారీ సక్సెస్ మీట్ ని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి... టాలీవుడ్ నుంచి అతిరధ మహారధులు హాజరవుతాయన్నది టాక్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మరి... ఈసారి ఎవరొస్తారో చూడాలి.