బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్ ప్రభంజనం సృష్టిస్తోంది. నాలుగో వారంలోనూ అఖండ దూసుకుపోతోంది. ఓ వైపు పుష్ప వచ్చినా, శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో సందడి చేస్తున్నా.. అఖండ జోరు ఆగలేదు. శనివారం కూడా అఖండకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆదివారం సైతం కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.
25 రోజులకు గానూ అఖండకు రూ.125 కోట్లు వచ్చాయని చిత్రబృందం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు దాటేసింది. ఒక్క నైజాంలోనే 20 కోట్ల షేర్ సాధించి బాలయ్య కెరీర్‌లోనే సరికొత్త రికార్డు చిత్రంగా నిలిచింది. సీడెడ్ లో ఇప్పటి వరకూ రూ. 15 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మైలురాయి దాటింది. అక్కడ అఖండ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గానే సాగుతోంది. ఫైనల్ రన్‌లో దాదాపుగా రూ.150 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే... 2021లో అఖండ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయినట్టే.