సంక్రాంతి అనగానే కొత్త సినిమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది. 2021లో సంక్రాంతి జోరు బాగానే కనిపించింది. 2022లోనూ... ఆ హడావుడి బాగానే ఉండబోతోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రెడీ అవ్వబోతోందని టాక్. ప్రస్తుతం `అఖండ`లో నటిస్తున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.
ఈ యేడాదే విడుదల అవుతుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించి, 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. గోపీచంద్ మలినిని తాజా హిట్ `క్రాక్` ఈ సంక్రాంతికే వచ్చింది. అందుకే గోపీచంద్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ ని కొనసాగించాలనుకుంటున్నాడన్నమాట.