అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈనెల 5న టైటిల్‌ని ప్రకటించబోతోంది చిత్రబృందం. అయితే ఇప్పటికే ఈ టైటిల్ బయటకు వచ్చేసింది. ఈసినిమాకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. బొమ్మరిల్లు భాస్కర్ కథల్లో లవ్ స్టోరీలు కొత్తగా ఉంటాయి. ఇందులోనూ వెరైటీ లవ్ స్టోరీ కనిపించబోతోందని సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో అఖిల్... ఓ అమ్మాయి కోసం అన్వేషిస్తుంటాడని, ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రేమ గురించీ, అందులోని గొప్పదనం గురించీ తెలుసుకుంటాడని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ఇదో కాదో తెలియాలంటే బుధవారం వరకూ ఎదురు చూడాల్సిందే. అఖిల్‌కి ఇప్పటి వరకూ ఒక్క హిట్టు కూడా లేదు. మరో వైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఓ హిట్టుకోసం తహతహలాడిపోతున్నాడు. మరి వీరిద్దరూ కలిసి ఎలాంటి అవుట్‌పుట్ ఇస్తారో చూడాలి.