'మోస్ట్ ఎలిచిబుల్ బ్యాచిలర్' తప్పితే అఖిల్ కెరీర్ లో మరో డీసెంట్ సినిమా లేదు. ఇపుడు అన్ని ఆశలు 'ఏజెంట్' పైనే వున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రమిది. సినిమాని ఏ క్షణాన ప్రకటించారో కానీ అడుగడుగునా అంతరాయాలు వచ్చాయి. ఏడాదిలో పూర్తి కావాల్సిన సినిమా మూడేళ్ళు పట్టింది. అలాగే ఇరవై ఐదు కోట్లు అనుకున్న బడ్జెట్ ట్రిపుల్ అయ్యిందని తెలుస్తుంది.
అఖిల్ మార్కెట్ ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు. భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్.. వరుసగా అపజయాలు ఎదురుకున్నాడు. బ్యాచిలర్ ఓకే అనిపించింది కానీ అందులో సగం క్రిడెట్ పూజా హెగ్డే కి వెళ్ళిపోయింది. ఈ సినిమా విషయంలో అఖిల్ లో తృప్తి లేదని మొన్న ఇంటర్వ్యూలో అతని మాటలు వింటే అర్ధమైయింది. 'బ్యాచిలర్ విజయం సాధించింది కానీ అది నేను కోరుకునే విజయం కాదు''అని తన మనసులో మాట బయటపెట్టాడు అఖిల్.
ఇప్పుడు తన హోప్స్ అన్నీ ఏజెంట్ పైనే వున్నాయి. వైల్డ్ గా చేసిన ఈ యాక్షన్ సినిమా తనకి మంచి విజయాన్ని తెస్తుందని నమ్మకంగా వున్నాడు. అయితే ఏజెంట్ కి పెట్టిన ఖర్చు వెనక్కి రావాలంటే హిట్ అయితే సరిపోదు. బ్లాక్ బస్టర్ కి మించిన మ్యాజిక్ ఎదో జరగాలి. మరి చూడాలి ప్రేక్షకుల తీర్పు ఎలా వుంటుందో.