విరూపాక్ష మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: విరూపాక్ష 
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్
దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు

నిర్మాత: బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్
ఛాయాగ్రహణం: శాందత్ సాయినుద్దీన్
కూర్పు: నవీన్ నూలి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3.25/5
 

కొన్ని సినిమాలు ట్రైలర్ చూసిన తర్వాత ఎలాగైనా సినిమాని చూడాలనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ ‘విరూపాక్ష’ కూడా అలానే ఆసక్తిని పెచింది. సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది.  సుకుమార్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చగా.. ఆయ‌న శిష్యుడు కార్తీక్ వ‌ర్మ  దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యాస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా కూడా విరూపాక్షనే. మరి ఇన్ని రకాలుగా ఆసక్తిని రేకెత్తించిన విరూపాక్ష కథ ఏమిటి ? అది ఎలాంటి థ్రిల్ ని పంచింది ? 

  
కథ : 80, 90లలో రుద్రవ‌నం అనే ఊరి చుట్టూ సాగే క‌థ ఇది. రుద్రవ‌నంలో వరుసగా అనుమానదస్పద స్థితిలో కొన్ని చావులు చోటు చేసుకుంటాయి. దాంతో గ్రామాన్ని అష్టదిగ్బంధ‌నం చేయాల‌ని తీర్మానిస్తారు పెద్దలు. కొన్ని రోజుల‌పాటు అక్కడి జ‌నాలు బ‌య‌టికి వెళ్లడానికి కానీ.. బయటవాళ్లు ఊళ్లోకి రావ‌డానికి కానీ అవ‌కాశం లేకుండా చేస్తారు. అదే సమయంలో త‌న త‌ల్లితో క‌లిసి బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్‌) ఈ మరణాల వెనుక వున్న మర్మాన్ని ఎలా చేధించాడు ?  తాను ప్రేమించిన నందిని (సంయుక్త)ప్రాణాల్ని కాపాడ‌టం కోసం ఏం చేశాడు ? అనేది మిగతా కథ.  


విశ్లేషణ: మిస్టరీ థ్రిల్లర్ కి ప్రేక్షకుల ద్రుష్టిని తిప్పుకోనివ్వకుండా చేసే ఓ ఆరంభం కావాలి. విరూపాక్షలో అలాంటి మైండ్ బ్లోయింగ్ ఆరంభం దొరికింది. చేత‌బ‌డి చేస్తూ చిన్న పిల్లల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్నారంటూ ఆ ఊరికి వ‌చ్చిన ఓ జంట‌ని స‌జీవ ద‌హ‌నం చేస్తారు గ్రామ‌స్థులు. వారు మంట‌ల్లో కాలిపోతూ పుష్కర కాలం త‌ర్వాత ఈ ఊరు వ‌ల్లకాడు అయిపోతుంద‌ని శపిస్తారు.. ఇలాంటి ఎపిసోడ్ తర్వాత ఖచ్చితంగా కథ నుంచి చూపుతిప్పుకోలేరు. కొత్త దర్శకుడు కార్తిక్ దండు కూడా ఈ బిగినింగ్ తో థ్రిల్ ని చాలా బలంగా పట్టుకున్నాడు. ఊరి శివార్లలో పాడుబ‌డిన ఓ ఇల్లు.. అక్కడ దాగిన ర‌హ‌స్యం..ప్రేక్షకులకు అక్కడ  ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తిని అడుగడుగనా కలిగిస్తాయి. 


హీరో రుద్రవనంలో అడుగుపెట్టిన తర్వాత  ప్రేమ‌క‌థ‌ కాస్త సాగదీత గా అనిపించిన దాన్ని కూడా కథలో కీలకంగా మార్చాడు దర్శకుడు. తర్వాత మిస్టరీ మరణాలు ప్రేక్షకులకు థ్రిల్ ని పంచుతాయి. అస‌లు ఆ చావులకు ఎవ‌రు కార‌ణ‌మో తెలుసుకోవాల‌నే ఆసక్తి రేకెత్తించ‌డంలో విరూపాక్ష టీం సక్సెస్ అయ్యింది. 


ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో అసలు కథ నడిచింది. అయితే చెప్పడానికి కథ ఎక్కువగా వుండటం, హీరో కావాల్సిన సమాచారం ఎక్కువ కావడంతో కథని వాయిస్ తో స్పీడ్ గా చెప్పేసి హీరోకి ఎదురయ్యే సవాళ్ళు కూడా హడావిగా తెల్చేసిన అనుభూతి కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చ్చే రెండు ట్విస్ట్ లు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళాయి.. 


నటీనటులు: థ్రిల్లర్స్ చేయడం తేజ్ కి కొత్త. అయితే సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఇందులో హీరోగా కాకుండా ఒక పాత్రగా ట్రావెల్ అయ్యాడు. ఆయ‌న పాత్ర, న‌ట‌న‌లో సహ‌జ‌త్వం క‌నిపిస్తుంది. యాక్షన్ స‌న్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. సంయుక్త కు కీలకమైన పాత్ర దక్కింది. ఆమె పాత్రకు రెండు కోణాలు వున్నాయి. అజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల‌, బ్రహ్మాజీ, సాయిచంద్‌, సునీల్, శ్యామ‌ల త‌దిత‌రుల పాత్రల‌కి మంచి ప్రాధాన్యం ద‌క్కింది. మిగతానటీనటులు పరిధి మేర కనిపించారు. 


టెక్నికల్:  సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్యామ్ ద‌త్ కెమెరా థ్రిల్లర్ మూడ్ ని ఎలివేట్ చేసింది.  ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ శ్రీనాగేంద్ర ప‌నిత‌నం మ‌రో ఎత్తు.  రుద్రవ‌నం గ్రామాన్ని మిస్టీరియస్ గా మార్చారు. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం చిత్రానికి ప్రధాన‌బ‌లం.నే ప‌థ్య సంగీతం చాలా బాగా కుదిరింది.  సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకి ప్రధాన‌బ‌లం. క‌థ‌లో మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. హారర్ టచ్ తో వున్న థ్రిల్లర్ ని అందించడంలో తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు దర్శకుడు. 


ప్లస్ పాయింట్స్:
కథ, కథనం 
మలుపులు, నటన, సాంకేతిక విలువలు 
 

మైనస్ పాయింట్స్:
ప్రేమకథలో బలం లేకపోవడం 
ద్వితీయార్ధంలో హడావిడి 


ఫైనల్ వర్దిక్ట్ : థ్రిల్ ఇచ్చే విరూపాక్ష...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS