బన్నీని ఫాలో అయిపోతోన్న అఖిల్‌!

మరిన్ని వార్తలు

బన్నీ లేటెస్ట్‌ మూవీ ‘అల  వైకుంఠపురములో’ సాధించిన సెన్సేషనల్‌ విజయంలో ఫస్ట్‌ ఫస్ట్‌ రిలీజ్‌ చేసిన ‘సామజవరగమనా..’ సాంగ్‌ వన్‌ ఆఫ్‌ ది ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. రిలీజ్‌కి నాలుగు నెలలు ముందే ఈ పాటని రిలీజ్‌ చేసి, బన్నీ తప్పు చేశాడనుకున్నారంతా మొదట్లో. కానీ, ఆ సినిమా విజయానికి ఆ పాట చేసిన హెల్ప్‌ అంతా ఇంతా కాదు. ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఇదే ఫార్ములాని మక్కీకి మక్కీ ఫాలో అయిపోతున్నట్లున్నాడు మన అక్కినేని బుల్లోడు అఖిల్‌. ఆయన నటిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిర్‌’ సినిమా నుండి ‘మనసా.. మనసా..’ అను ఆడియో సింగిల్‌ రిలీజ్‌ చేశారు. సిడ్‌ శ్రీరామ్‌ గాత్రంలో బన్నీ ‘సామజవరగమనా..’ సాంగ్‌ని మరిపిస్తోంది ఈ సాంగ్‌.

 

కుర్రోళ్ల మనసుల్ని ఊదరగొట్టేస్తోంది. వయసులో ఉన్న కుర్రోళ్ల మనసు మీద ఉన్న అదుపును అందంగా వివరిస్తూ సాగే ఈ పాటలోని లిరిక్స్‌ నిజంగానే కుర్రోళ్ల గుండె గిల్లి ప్రాణం తీసేస్తున్నాయి. ఇంకేముంది అఖిల్‌ ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కొట్టేశాడీ సాంగ్‌తో. ఇక తాను అనుకున్న సక్సెస్‌ అందుకుంటాడో లేదో తెలియాంటే, ఇంకాస్త సమయం పడుతుంది. బొమ్మరిల్లు  భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు  అరవింద్‌ సమర్పిస్తున్నారు.  పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS