కరోనాపై కామెడీనా.. దిమ్మాక్‌ గిట్లా ఖరాబ్‌ అయ్యిందా.!

By Inkmantra - March 03, 2020 - 09:31 AM IST

మరిన్ని వార్తలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కామెడీ చేస్తూ, వెకిలి నవ్వులు నవ్వుతూ హీరోయిన్‌ ఛార్మి ఓ వీడియో పోస్ట్‌ చేసింది. కంగ్రాట్స్‌ హైద్రాబాద్‌.. ఢిల్లీ, తెలంగాణాకు కూడా కరోనా వైరస్‌ వచ్చేసిందట.. అంటూ నవ్వుతూ మాట్లాడుతోన్న ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌ అయిపోయింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మామూుగా గుస్సా అవ్వడం లేదు. ఇదేమైనా కామెడీ చేసే విషయమా.? యావత్‌ ప్రపంచం భయంతో వణికిపోతోంది. వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలు  హరించేస్తోంది.

 

అలాంటి వైరస్‌ విషయంలో ఇలా కామెడీ చేయడమేంటీ.? ఛార్మికి  దిమాఖ్‌ ఖరాబ్‌ అయ్యినట్లుంది.. అంటూ నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నారు. దాంతో, ఛార్మి కరోనాపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ, వీడియోని వెంటనే డిలీట్‌ చేసింది. అయితే, అప్పటికే వీడియో వైరల్‌ అయిపోయేసరికి, దొరికిన వాళ్లు దొరికినట్లు ఛార్మితో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇకపోతే, ఛార్మి ప్రస్తుతం ‘ఫైటర్‌’ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి పూరీ జగన్నాధ్‌ దర్శకుడు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీతో కలిసి ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో జాయ్‌ఫుల్‌గా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం.   


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS