వరుసగా మూడు ఫ్లాపులతో.. తన కెరీర్‌ని మొదలెట్టాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇప్పుడు తన జాతకం అంతా.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఆధార పడి వుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాకి ముందు నుంచీ హైప్ లేదు. దానికి తగ్గట్టు.. రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకి రీషూట్లు జరుగుతున్నాయని, అవుట్ పుట్ పై అటు నాగార్జున గానీ, ఇటు అరవింద్ గానీ సంతృప్తి గా లేరని టాక్ వినిపించింది. ఈ సినిమాని డైరెక్టుగా ఓటీటీలోనే విడుదల చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆ తరవాత.. చిత్రబృందం విడుదల తేదీ ప్రకటించి రూమర్లకు చెక్ పెట్టింది. మే 21 న ఈ సినిమా రాబోతోంది.
అయితే ఇప్పుడు మరో గాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమాని డెరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నార్ట. ఓటీటీ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందని, అది అరవింద్ కి కూడా నచ్చిందని టాక్. అయితే.. వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ కి ఓ హిట్టు చాలా అవసరం. ఇలాంటి నేపథ్యంలో ఈసినిమాని ఓటీటీకి ఇచ్చేస్తే.. అది అఖిల్ కెరీర్‌పై నెగిటీవ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసినిమాని థియేటర్లకు తీసుకురావాల్సిందే. నాగ్ అభిప్రాయం కూడా అదే. ఆఫర్ ఎంత టెమ్టింగ్ గా ఉన్నా, దాని కోసం అఖిల్ కెరీర్‌ని పణంగా పెట్టే రిస్క్ ఆయన తీసుకోరు. మరి ఈ విషయంలో నాగ్ ఏమంటాడో? అసలు ఓటీటీ విడుదల అనే రూమర్.. నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.