బాలీవుడ్‌ మూవీలో అక్కినేని తండ్రీ కొడుకులు.?

By iQlikMovies - August 03, 2018 - 17:11 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో తాజాగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో కరణ్‌జోహార్‌ రూపొందిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ కపూర్‌, అలియాభట్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా రూపొందిస్తున్నారు. 

కాగా ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. బల్గేరియాలో ఈ మధ్య లాంగ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంది 'బ్రహ్మాస్త్ర'. ఈ షూటింగ్‌లో తన పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుని ఈ మధ్యనే ఇండియాకి తిరిగొచ్చాడు నాగార్జున. ఇది తెలిసిన విషయమే. కాగా తాజాగా 'బ్రహ్మస్త్ర' టీమ్‌తో అఖిల్‌ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ సినిమాలో అఖిల్‌ కూడా ఉన్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ ఉంటే, అఖిల్‌ ఎలాంటి క్యారెక్టర్‌ చేయబోతున్నాడు.? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

కరణ్‌జోహార్‌, రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి అఖిల్‌ దిగిన సెల్ఫీనే ఈ ఊహాగానాలకు కారణం. అదీ ఈ సెల్ఫీని కరణ్‌జోహార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసుకోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది. అయితే ప్రస్తుతం అఖిల్‌ 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌ క్యూట్‌ భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో అఖిల్‌తో జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS