అఖిల్ కోసం రంగంలోకి దిగుతున్న రామ్‌చ‌ర‌ణ్‌

By iQlikMovies - November 25, 2018 - 12:08 PM IST

మరిన్ని వార్తలు

ఓ హిట్టు కోసం ప‌రిత‌పించిపోతున్నాడు అఖిల్‌. త‌న తొలి రెండు సినిమాలూ బోల్తా ప‌డ‌డంతో.. మూడో సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను`పైనే ఆశ‌లు పెట్టుకున్నాడు. ఆ త‌ర‌వాత కూడా త‌న కెరీర్‌ని జాగ్ర‌త్త‌గానే ప్లాన్ చేసుకున్నాడు. నాలుగో చిత్రానికి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ కాంబినేష‌న్ కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే... ఈ చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ - బోయ‌పాటి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆ త‌ర‌వాత బోయ‌పాటి అఖిల్ సినిమా ప్రాజెక్ట్ మొద‌లెడ‌తారు. ఈచిత్రాన్ని చ‌ర‌ణ్ త‌న కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ పై తెర‌కెక్కిస్తాడ‌ట‌. ఖైది నెం 150 , సైరా చిత్రాల‌కు చ‌ర‌ణ్‌నిర్మాత‌. తొలిసారి బ‌య‌టి క‌థానాయ‌కుడితో చ‌ర‌ణ్‌సినిమా చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

అన్న‌ట్టు అఖిల్ తొలి చిత్రం అఖిల్‌కి నితిన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే... చ‌ర‌ణ్ ధైర్యంగానే రంగంలోకి దిగుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS