కేజీఎఫ్, కాంతారా చిత్రాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకొని, సౌత్ ఇండియన్ సినిమాల ప్రతిష్ట పెంచిన సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు టాలీవుడ్ హీరోలతోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ బ్యానర్లో సినిమా చేయడానికి అఖిల్ సైతం సిద్ధంగా ఉన్నాడు. అఖిల్ ప్రస్తుతం... ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సినిమా మొదలవుతుంది. దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలుస్తోంది. దీంతో పాటు.. యూవీ క్రియేషన్స్ లోనూ ఓ సినిమా చేయడానికి అఖిల్ ఒప్పుకొన్నట్టు టాక్. యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేయాలని అఖిల్ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఎట్టకేలకు అఖిల్ కి సరిపడ కథ రెడీ అయ్యిందని టాక్. ఈ చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా కూడా ఈ యేడాదే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది కాకుండా.. నాగార్జున - మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ అఖిల్ నటిస్తున్నాడు. నాగ్ కి ఇది వందో సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం... ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు నాగ్. ఇది తనకు 99వ చిత్రం. ఆ తరవాతే... మోహన్ రాజా సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి అఖిల్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట.